పరమగీతము 3:5
చుట్టుపక్కల సందర్భంతో వచనం 5 చూపబడుతోంది.
2
నేను ఇప్పుడే లేచి పట్టణం వైపు వెళ్తాను, పట్టణ వీధుల్లో రహదారుల్లో వెదకుతాను; నా హృదయం ప్రేమిస్తున్నవాని కోసం నేను వెదకుతాను. కాబట్టి నేను ఆయన కోసం వెదికాను కాని ఆయన కనపడలేదు.
3
పట్టణంలో గస్తీ తిరుగుతున్న కావలివారు నాకు ఎదురుపడితే “మీరు నా ప్రాణప్రియుని చూశారా?” అని వారినడిగాను.
4
నేను దాదాపుగా వారిని దాటి వెళ్లాను అప్పుడు నా ప్రేమికుడు నాకు కనిపించాడు. ఆయనను గట్టిగా పట్టుకున్నాను ఆయనను నా తల్లి గృహానికి, నన్ను కనిన గది లోనికి తెచ్చే వరకు నేను వదల్లేదు.
5
యెరూషలేము కుమార్తెలారా! పొలములోని జింకలను బట్టి లేళ్లను బట్టి మీతో ప్రమాణము చేయిస్తున్నాను: సరియైన సమయం వచ్చేవరకు ప్రేమను లేపకండి, మేల్కొల్పకండి.
6
ధూమ స్తంభాకరంలో వర్తకుల దగ్గర సుగంధ చూర్ణాలన్నిటితో తయారుచేయబడిన బోళం పరిమళ వాసనతో అరణ్య మార్గాన నడిచి వస్తున్నదేంటి?
7
చూడండి! ఆ వచ్చేది సొలొమోను పల్లకి, అరవైమంది శూరుల భద్రతలో ఇశ్రాయేలీయులలో అతి జ్ఞానముగల యోధులు,
8
వారిలో అందరు ఖడ్గమును ధరించిన వారు, యుద్ధంలో అనుభవం కలవారు, ప్రతి ఒక్కరు రాత్రి కలిగే దాడులకు సిద్ధపడి, ఖడ్గం ధరించి సన్నద్ధులై వస్తున్నారు.
Settings