Skip to content
పరమగీతము 3:1-4

పరమగీతము 3:1-4

1
రాత్రంతా నేను పడుకుని నా హృదయం ప్రేమించేవాని కోసం నేను చూశాను; ఆయన కోసం చూశాను కాని ఆయన రాలేదు.
2
నేను ఇప్పుడే లేచి పట్టణం వైపు వెళ్తాను, పట్టణ వీధుల్లో రహదారుల్లో వెదకుతాను; నా హృదయం ప్రేమిస్తున్నవాని కోసం నేను వెదకుతాను. కాబట్టి నేను ఆయన కోసం వెదికాను కాని ఆయన కనపడలేదు.
3
పట్టణంలో గస్తీ తిరుగుతున్న కావలివారు నాకు ఎదురుపడితే “మీరు నా ప్రాణప్రియుని చూశారా?” అని వారినడిగాను.
4
నేను దాదాపుగా వారిని దాటి వెళ్లాను అప్పుడు నా ప్రేమికుడు నాకు కనిపించాడు. ఆయనను గట్టిగా పట్టుకున్నాను ఆయనను నా తల్లి గృహానికి, నన్ను కనిన గది లోనికి తెచ్చే వరకు నేను వదల్లేదు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options