పరమగీతము 2:10-14
10
నా ప్రియుడు మాట్లాడి నాతో అన్నాడు, నా ప్రియురాలా, లే, నా సౌందర్యవతి, నాతో రా.
11
చూడండి! శీతాకాలం గడిచిపోయింది; వర్షాలు అయిపోయాయి.
12
భూమిపై పువ్వులు ప్రత్యక్షమవుతాయి; పాడే రుతువు వచ్చేసింది. మన దేశంలో పావురాల కూత వినిపిస్తూ ఉంది.
13
అంజూర చెట్టు దాని తొలి ఫలాలను కాస్తుంది; ద్రాక్షచెట్లు వికసించి సువాసనను వెదజల్లుతున్నాయి. నా ప్రియురాలా, లేచి, రా, నా సౌందర్యవతి, నాతో రా.
14
బండ సందుల్లో, పర్వత ప్రాంతంలో దాగే స్థలాల్లో ఉన్న నా పావురమా, నీ ముఖాన్ని నాకు చూపించు, నీ స్వరాన్ని విననివ్వు; ఎందుకంటే నీ స్వరం మధురం నీ ముఖం మనోహరము.
Settings