రూతు 1:8-13
8
అయితే దారిలో నయోమి తన ఇద్దరు కోడళ్ళతో, “మీరు మీ పుట్టిళ్ళకు తిరిగి వెళ్లండి. నా మీద, చనిపోయిన మీ భర్తల మీద మీరు దయ చూపించినట్లు యెహోవా మీమీద దయ చూపును గాక.
9
మీరు మళ్ళీ పెళ్ళి చేసుకుని మీ భర్తల ఇండ్లలో నెమ్మది పొందేలా యెహోవా దయచేయును గాక” అన్నది. తర్వాత వారికి ముద్దు పెట్టింది, వారు బిగ్గరగా ఏడ్చి,
10
ఆమెతో, “మేము నీతో నీ ప్రజల దగ్గరకు వస్తాం” అని అన్నారు.
11
కాని నయోమి, “నా కుమార్తెలారా, మీ ఇళ్ళకు తిరిగి వెళ్లండి, నాతో ఎందుకు వస్తారు? మీకు భర్తలుగా ఉండడానికి నేను ఇంకా కుమారులను కనగలనా?
12
నా బిడ్డలారా, ఇళ్ళకు తిరిగి వెళ్లండి; నేను వృద్ధురాలిని, నేను మళ్ళీ పెళ్ళి చేసుకునే వయస్సులో లేను, ఒకవేళ అది సాధ్యమే అని ఆశించి, ఈ రాత్రి నేను పెళ్ళి చేసుకుని, కుమారులను కన్నా,
13
వారు ఎదిగే వరకు మీరు వేచి ఉంటారా? వారి కోసం పెళ్ళి చేసుకోకుండ ఉంటారా? వద్దు, నా బిడ్డలారా, యెహోవా హస్తం నాకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి మీకంటే ఎక్కువ బాధ నాకు ఉంది!” అని జవాబిచ్చింది.
Settings