కీర్తనలు 88:8-16
8
నా దగ్గరి స్నేహితులను నా నుండి దూరం చేశారు నన్ను వారికి అసహ్యమైన వానిగా చేశారు. నేను నిర్బంధించబడ్డాను నేను తప్పించుకోలేను;
9
దుఃఖంతో నా కళ్లు మసకబారాయి. యెహోవా, ప్రతిరోజు నేను మీకు మొరపెడుతున్నాను; మీ వైపు నా చేతులు చాచాను.
10
మృతులకు మీరు అద్భుతాలు చూపిస్తారా? వారి ఆత్మలు లేచి మిమ్మల్ని స్తుతిస్తాయా? సెలా
11
సమాధిలో మీ మారని ప్రేమ ప్రకటించబడుతుందా? నాశనకూపంలో మీ నమ్మకత్వం ప్రకటించబడుతుందా?
12
చీకటి స్థలంలో మీ అద్భుతాలు తెలుస్తాయా? మరుపుకు గురియైన దేశంలో మీ నీతి క్రియలు తెలుస్తాయా?
13
కాని యెహోవా, నేను సహాయం కోసం మీకు మొరపెడతాను; ఉదయం నా ప్రార్థన మీ ఎదుటకు వస్తుంది.
14
యెహోవా, మీరు ఎందుకు నన్ను తృణీకరిస్తూ నా నుండి మీ ముఖాన్ని దాచుకుంటున్నారు?
15
నా యవ్వనం నుండి నేను బాధను అనుభవించి మరణానికి దగ్గరగా ఉన్నాను; నేను మీ భయాలను భరించి నిరాశలో ఉన్నాను.
16
మీ ఉగ్రత నన్ను ముంచేసింది; మీ భయాలు నన్ను నిర్మూలం చేశాయి.
Settings