Skip to content
కీర్తనలు 7:6-10

తీర్పరిగా లేచి నిలువమని దేవునికి మొర పెట్టుట

కీర్తనలు 7:6-10
6
యెహోవా, కోపంతో లేవండి; నా శత్రువుల ఆగ్రహానికి వ్యతిరేకంగా లేవండి. నా దేవా, మేల్కొనండి; న్యాయాన్ని శాసించండి.
7
మీరు వారికి పైగా ఉన్నత సింహాసనంపై ఆసీనులై ఉండగా, ఆయా జాతుల ప్రజలు మీ చుట్టూ గుమికూడనివ్వండి.
8
యెహోవా జనులకు తీర్పు తీర్చును గాక. యెహోవా, నా నీతిని బట్టి, ఓ మహోన్నతుడా, నా యథార్థతను బట్టి నాకు శిక్షావిముక్తి చేయండి.
9
మనస్సులను హృదయాలను పరిశీలించే, నీతిమంతుడవైన దేవా, దుష్టుల దుర్మార్గాన్ని అంతం చేసి, నీతిమంతులను భద్రపరచండి.
10
యథార్థ హృదయులను కాపాడే సర్వోన్నతుడైన దేవుడే నాకు డాలు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options