కంటెంట్‌కు వెళ్లండి
కీర్తనలు 7:11-16

దైవిక తీర్పు నిశ్చయము

కీర్తనలు 7:11-16
11
దేవుడు నీతిగల న్యాయమూర్తి, ఆయన దుష్టులపై ప్రతిరోజు తన ఉగ్రతను చూపిస్తారు.
12
ఒకవేళ ఎవరైనా పశ్చాత్తాపపడకపోతే, దేవుడు తన ఖడ్గాన్ని పదునుపెడతారు; ఆయన తన విల్లు ఎక్కుపెట్టి బాణం సిద్ధపరుస్తారు.
13
ఆయన తన మారణాయుధాలు సిద్ధం చేసుకుంటారు; ఆయన తన అగ్ని బాణాలు సిద్ధం చేసుకుంటారు.
14
దుష్టులు చెడును గర్భం దాలుస్తారు, కీడును గర్భంలో మోసి అబద్ధాలకు జన్మనిస్తారు.
15
ఇతరుల కోసం గుంటను త్రవ్వుతారు తాము త్రవ్విన గుంటలో వారే పడతారు.
16
వారు చేసిన కీడు వారికే చుట్టుకుంటుంది; వారు చేసిన హింస వారి తల మీదికే వస్తుంది.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options