Skip to content
కీర్తనలు 64:1-6

కీర్తనలు 64:1-6

1
సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. నా దేవా, నా ఫిర్యాదు వినండి; శత్రువు భయం నుండి నా జీవితాన్ని కాపాడండి.
2
దుష్టుల కుట్ర నుండి, కీడుచేసేవారి పన్నాగాల నుండి నన్ను దాచండి.
3
వారు తమ నాలుకలను ఖడ్గాల్లా పదునుపెడతారు మరణకరమైన బాణాల వంటి క్రూరమైన పదాలను లక్ష్యంగా చేసుకుంటారు.
4
చాటున ఉండి నిర్దోషుల మీదికి బాణాలు విసురుతారు. వారు భయం లేకుండా, అకస్మాత్తుగా బాణాలు విసురుతారు.
5
కీడు తలపెట్టడంలో వారు ఒకరినొకరు ప్రోత్సహిస్తారు. వారు తమ వలలను దాచడం గురించి మాట్లాడతారు; వారంటారు, “దీన్ని ఎవరు చూస్తారు?”
6
వారు అన్యాయాలను రూపొందించి అంటారు, “మేము ఒక సంపూర్ణ ప్రణాళికను రూపొందించాము!” నిశ్చయంగా మానవుల మనస్సు హృదయం మోసపూరితమైనవి.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options