కీర్తనలు 63:3-8
3
మీ మారని ప్రేమ జీవం కంటే ఉత్తమం నా పెదవులు మిమ్మల్ని స్తుతిస్తాయి.
4
నా జీవితకాలమంతా నేను మిమ్మల్ని స్తుతిస్తాను. మీ పేరును బట్టి నా చేతులు ఎత్తుతాను.
5
శ్రేష్ఠమైన ఆహారం దొరికినట్లు నేను సంతృప్తి పొందుతాను; సంతోషించే పెదవులతో నా నోరు మిమ్మల్ని స్తుతిస్తుంది.
6
పడక మీద నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను; రాత్రి జాముల్లో నేను మీ గురించి ఆలోచిస్తాను.
7
మీరు నాకు సహాయం కాబట్టి మీ రెక్కల నీడలో నేను ఆనందంతో పాడతాను.
8
నేను మీకు అంటిపెట్టుకుని ఉంటాను; మీ కుడిచేయి నన్ను ఆదుకుంటుంది.
Settings