Skip to content
కీర్తనలు 55:16-23

నిర్దోషిత్వము కొరకు దేవునిపై నమ్మకము

కీర్తనలు 55:16-23
16
నేను మాత్రం, దేవునికి మొరపెడతాను, యెహోవా నన్ను రక్షిస్తారు.
17
సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం నేను బాధలో మొరపెడతాను, ఆయన నా స్వరం వింటారు.
18
అనేకులు నన్ను వ్యతిరేకించినప్పటికి, నాకు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధం నుండి నా ప్రాణాన్ని సమాధానంలో విమోచిస్తారు.
19
పూర్వం నుండి సింహాసనాసీనుడైయున్న మారని దేవుడు, అది విని వారిని అణచివేస్తారు, సెలా వారు మారడానికి ఒప్పుకోరు ఎందుకంటే వారికి దేవుని భయం లేదు.
20
నా సహచరుడు తన స్నేహితుల మీద దాడి చేసి; వారితో తాను చేసిన నిబంధనకు తానే భంగం కలిగిస్తాడు.
21
అతని మాటలు వెన్నలా మృదువుగా ఉంటాయి, కాని అతని హృదయంలో యుద్ధం ఉంటుంది; అతని మాటలు నూనె కన్న నున్నగా ఉంటాయి కానీ అవి దూసిన ఖడ్గాల్లాంటివి.
22
మీ భారాన్ని యెహోవాపై మోపండి ఆయన మిమ్మల్ని సంరక్షిస్తారు; నీతిమంతులను ఆయన ఎన్నడు కదలనివ్వరు.
23
కాని దేవా, మీరు దుష్టులను నాశనకూపంలో పడవేస్తారు; రక్తపిపాసులు మోసగాళ్లు వారి ఆయుష్షులో సగం కూడ జీవించరు. కానీ నేనైతే మిమ్మల్ని నమ్ముకున్నాను.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options