కీర్తనలు 51:1-2
1
సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. దావీదు బత్షెబతో వ్యభిచరించిన తర్వాత నాతాను ప్రవక్త తన దగ్గరకు వచ్చిన సందర్భంలో వ్రాశాడు. ఓ దేవా, మీ మారని ప్రేమను బట్టి నన్ను కరుణించండి; మీ గొప్ప కనికరాన్ని బట్టి, నా పాపాలను తుడిచివేయండి.
2
నా దోషాలన్నింటిని కడిగి, నా పాపము నుండి నన్ను శుభ్రపరచండి.