Skip to content
కీర్తనలు 49:6-14

కీర్తనలు 49:6-14

6
వారు తమ సంపదను నమ్మి, తమ ఐశ్వర్యాన్ని గురించి గొప్పలు చెప్పుకుంటారు.
7
ఎవరు మరొకరి ప్రాణాన్ని విడిపించలేరు వారి కోసం దేవునికి క్రయధనం చెల్లించలేరు.
8
వారు కుళ్లు చూడక, నిత్యం బ్రతకాలంటే వారి ప్రాణ విమోచన వెల చాలా ఎక్కువ అది ఎన్నటికి చెల్లించబడలేదు.
10
తమ సంపదను ఇతరులకు వదిలేసి జ్ఞానులు చనిపోవడం, మూర్ఖులు తెలివిలేనివారు నశించడం అందరు చూస్తారు.
11
వారు తమ భూములకు తమ పేర్లే పెట్టుకున్నప్పటికి సమాధే వారి నిత్య నివాసము అక్కడే వారు నిత్యం నివసిస్తారు.
12
మనుష్యులు ఎంత సంపద ఉన్నా నశించకుండ ఉండలేరు; నశించే జంతువుల్లా వారు ఉన్నారు.
13
తమను తాము నమ్ముకొనే బుద్ధిహీనులకు, వారు చెప్పేది వింటూ వారిని అనుసరించేవారికి ఇదే గతి. సెలా
14
వారు గొర్రెల్లా ఉండి మరణానికి నడిపించబడతారు; మరణమే వారికి కాపరి. యథార్థవంతులు ఉదయం వారిని పరిపాలిస్తారు. వారి రాజభవనాలకు దూరంగా, సమాధిలో వారి మృతదేహాలు కుళ్ళిపోతాయి.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options