కీర్తనలు 45:2-9
2
మీరు మనుష్యుల్లో అత్యంత అద్భుతమైనవారు మీ పెదవులపై దయ నిండి ఉంది, దేవుడు మిమ్మల్ని నిత్యం ఆశీర్వదిస్తారు.
3
బలాఢ్యుడా, మీ ఖడ్గాన్ని నడుముకు కట్టుకోండి; వైభవం ప్రభావాలను ధరించుకోండి.
4
సత్యం, వినయం, న్యాయం కోసం మీ వైభవంతో విజయవంతంగా ముందుకు సాగిపోండి. మీ కుడిచేయి భీకరమైన క్రియలు సాధించాలి.
5
పదునైన మీ బాణాలు శత్రురాజుల గుండెలను చీల్చుకునిపోతాయి. మీ పాదాల క్రింద జనాలు కూలి పడతారు.
6
ఓ దేవా, మీ సింహాసనం నిరంతరం నిలుస్తుంది; మీ న్యాయ దండమే మీ రాజ్య దండం.
7
మీరు నీతిని ప్రేమించి దుష్టత్వాన్ని ద్వేషిస్తారు; కాబట్టి దేవుడు, మీ దేవుడు ఆనంద తైలంతో మిమ్మల్ని అభిషేకించి, మీ తోటివారి కన్నా మిమ్మల్ని ఉన్నతస్థితికి హెచ్చించారు.
8
మీరు ధరించిన వస్త్రాలన్ని గోపరసం, అగరు, లవంగపట్ట సుగంధంతో గుభాళిస్తున్నాయి. దంతం చేత అలంకరించబడిన భవనాలలో నుండి తంతి వాయిద్యాలు మోగుతూ ఉంటే మీకెంతో ఆనందము.
9
ఘనత వహించిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. ఓఫీరు దేశపు సువర్ణాభరణాలతో అలంకరించుకుని రాణి మీ కుడి ప్రక్కన నిలిచి ఉంది.
Settings