కీర్తనలు 41:4-9
4
“యెహోవా, నన్ను కరుణించండి; నన్ను స్వస్థపరచండి, మీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను.”
5
నా శత్రువులు, “వీడెప్పుడు చస్తాడు, వీని పేరు ఎప్పుడు చెరిగిపోతుంది?” అని నా గురించి చెప్పుకుంటున్నారు.
6
నన్ను చూడటానికి వచ్చి అబద్ధాలాడతారు, వారు తమ హృదయంలో దుష్టత్వం నింపుకొని వస్తారు; వారు బయటకు వెళ్లినప్పుడు దానిని చెప్తారు.
7
నా శత్రువులంతా ఏకమై నాకు వ్యతిరేకంగా గుసగుసలాడుతున్నారు; నాకు కీడును తలపెడుతున్నారు.
8
“దుష్టమైన వ్యాధి అతనికి కలిగింది; కాబట్టి వాడు పడక నుండి మళ్ళీ లేవడు” అంటున్నారు.
9
నేను నమ్మిన నా దగ్గరి స్నేహితుడు, నా ఆహారం తిన్నవాడే, నాకు వ్యతిరేకంగా మడిమ ఎత్తాడు.
Settings