కీర్తనలు 38:2-6
2
మీ బాణాలు నాకు గుచ్చుకున్నాయి, మీ చేయి నా మీద బరువుగా పడింది.
3
మీ ఉగ్రత వల్ల నా శరీరంలో ఆరోగ్యం లేదు; నా పాపాన్ని బట్టి నా ఎముకల్లో నెమ్మది లేదు.
4
నా దోషం భరించలేని భారంలా నన్ను ముంచెత్తింది.
5
నా బుద్ధిహీనతతో చేసిన పాపాల వల్ల నా గాయాలు కుళ్ళి దుర్వాసన వస్తున్నాయి.
6
నేను చాలా క్రుంగిపోయాను; దినమంతా దుఃఖంలోనే ఉన్నాను.
Settings