Skip to content
కీర్తనలు 27:7-14

కీర్తనలు 27:7-14

7
యెహోవా, నేను మొరపెట్టినప్పుడు నా స్వరాన్ని ఆలకించండి; నాపై కరుణ చూపించి నాకు జవాబివ్వండి.
8
“ఆయన ముఖాన్ని వెదకు!” అని నా హృదయం మీ గురించి అంటుంది, యెహోవా, మీ ముఖాన్ని నేను వెదకుతాను.
9
మీ ముఖాన్ని నా నుండి దాచకండి, కోపంతో మీ దాసున్ని త్రోసివేయకండి; మీరే నాకు సహాయము. దేవా నా రక్షకా, నన్ను త్రోసివేయకండి నన్ను విడిచిపెట్టకండి.
10
నా తల్లిదండ్రులు నన్ను విడిచినా, యెహోవా నన్ను చేరదీస్తారు.
11
యెహోవా, మీ మార్గం నాకు బోధించండి; నాకు విరోధులు మాటున పొంచి ఉన్నారు, కాబట్టి మీరే నన్ను సరియైన దారిలో నడిపించాలి.
12
నా శత్రువుల కోరికకు నన్ను అప్పగించకండి, ఎందుకంటే అబద్ధ సాక్షులు నామీదికి లేచి, హానికరమైన ఆరోపణలను చేస్తున్నారు.
13
నేను దీనిపై నమ్మకంగా ఉన్నాను: సజీవులన్న చోట నేను యెహోవా మంచితనాన్ని చూస్తాను.
14
యెహోవా కోసం కనిపెట్టండి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి యెహోవా కోసం కనిపెట్టండి.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options