కీర్తనలు 22:16-21
16
కుక్కలు నా చుట్టూ గుమికూడాయి, దుష్టుల మూక నా చుట్టూ మూగింది; వారు నా చేతుల్లో నా పాదాల్లో పొడిచారు.
17
నా ఎముకలన్నీ బయటకు కనబడుతున్నాయి; ప్రజలు నన్ను చూస్తూ ఎగతాళిగా నవ్వుతున్నారు.
18
నా వస్త్రాలు పంచుకుని నా అంగీ కోసం చీట్లు వేస్తారు.
19
అయితే, యెహోవా మీరు నాకు దూరంగా ఉండకండి. మీరే నాకు బలం; నాకు సాయం చేయడానికి త్వరగా రండి.
20
ఖడ్గం నుండి నన్ను విడిపించండి, కుక్కల బలం నుండి నా విలువైన ప్రాణాన్ని కాపాడండి.
21
సింహాల నోటి నుండి నన్ను కాపాడండి; అడవి దున్నల కొమ్ముల నుండి నన్ను విడిపించండి.
Settings