కీర్తనలు 141:5-6
5
నీతిమంతులు నన్ను కొట్టడం నామీద దయ చూపడమే; వారు నన్ను మందలించడం నాకు తైలాభిషేకమే. నా తల దానిని నిరాకరించదు, కీడుచేసేవారి క్రియలకు విరుద్ధంగా నా ప్రార్థన మాత్రం మానను.
6
వారి పాలకులు కొండలపై నుండి పడద్రోయబడతారు, అప్పుడు వారు నా మాటలు నిజమని గ్రహిస్తారు.