Skip to content
కీర్తనలు 136:10-24

కీర్తనలు 136:10-24

10
ఈజిప్టు తొలిసంతానాన్ని ఆయన సంహరించారు, ఆయన ప్రేమ నిరంతరం ఉంటుంది.
11
వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించారు, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
12
చేయి చాచి తన బలమైన హస్తంతో వారిని రప్పించింది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
13
ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చిన దేవునికి స్తుతులు చెల్లించండి, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
14
దాని మధ్యలో నుండి ఇశ్రాయేలీయులను దాటించింది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
15
ఫరోను, అతని సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచివేసింది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
16
అరణ్యం గుండా తన ప్రజలను నడిపించిన దేవునికి స్తుతులు చెల్లించండి, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
17
గొప్పరాజులను పడగొట్టిన దేవునికి స్తుతులు చెల్లించండి, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
18
బలాఢ్యులైన రాజులను చంపింది ఆయనే ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
19
అమోరీయుల రాజైన సీహోనును చంపింది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
20
బాషాను రాజైన ఓగును చంపింది ఆయనే ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
21
వారి దేశాన్ని వారసత్వంగా ఇచ్చింది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
22
తన సేవకుడైన ఇశ్రాయేలుకు దానిని వారసత్వంగా ఇచ్చింది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
23
మనం దీనదశలో ఉన్నప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
24
మన శత్రువుల నుండి మనల్ని విడిపించింది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options