Skip to content
కీర్తనలు 118:19-27

రక్షణ ద్వారాలలో ప్రవేశం

కీర్తనలు 118:19-27
19
నా కొరకు నీతిమంతుల గుమ్మాలను తెరవండి; నేను లోపలికి ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతలు చెల్లిస్తాను.
20
ఇది యెహోవా గుమ్మం నీతిమంతులు దీని గుండా ప్రవేశిస్తారు.
21
మీరు నాకు జవాబిచ్చారు, కాబట్టి నేను మీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను; మీరు నాకు రక్షణ అయ్యారు.
22
ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి మూలరాయి అయ్యింది;
23
ఇది యెహోవా చేశారు, ఇది మా కళ్లకు ఆశ్చర్యంగా ఉంది.
24
ఇది యెహోవా చేసిన దినం ఈ దినం మనం ఉత్సహించి ఆనందిద్దాము.
25
యెహోవా, మమ్మల్ని రక్షించండి! యెహోవా, మాకు విజయం ప్రసాదించండి!
26
యెహోవా పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక! యెహోవా మందిరం నుండి మేము మిమ్మల్ని దీవిస్తాము.
27
యెహోవాయే దేవుడు, ఆయన తన వెలుగును మనమీద ప్రకాశింపజేశారు. త్రాళ్లతో అర్పణను బలిపీఠం కొమ్ములకు కట్టెయ్యండి.

బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.