కీర్తనలు 116:5-9
5
యెహోవా దయగలవాడు నీతిమంతుడు; మన దేవుడు కనికరం కలవాడు.
6
యెహోవా సామాన్యులను కాపాడతారు; నేను దుర్దశలో ఉన్నప్పుడు, ఆయన నన్ను రక్షించారు.
7
నా ప్రాణమా, నీ విశ్రాంతికి తిరిగి వెళ్లు, ఎందుకంటే యెహోవా నీ పట్ల గొప్పగా వ్యవహరించారు.
8
యెహోవా, మీరు, మరణం నుండి నన్ను, కన్నీటి నుండి నా కళ్ళను, జారిపడకుండా నా పాదాలను విడిపించారు.
9
నేను సజీవుల భూమిలో యెహోవా ఎదుట నడుస్తాను.
Settings