కీర్తనలు 116:5
చుట్టుపక్కల సందర్భంతో వచనం 5 చూపబడుతోంది.
2
ఆయన తన చెవిని నా వైపు త్రిప్పారు కాబట్టి, నేను ప్రాణంతో ఉన్నంత వరకు ఆయనకు మొరపెడుతుంటాను.
3
మరణపాశాలు నన్ను చుట్టివేశాయి, సమాధి వేదన నా మీదికి వచ్చింది. బాధ దుఃఖం నన్ను అధిగమించాయి.
4
అప్పుడు నేను యెహోవా నామమున మొరపెట్టాను: “యెహోవా, నన్ను రక్షించండి!”
5
యెహోవా దయగలవాడు నీతిమంతుడు; మన దేవుడు కనికరం కలవాడు.
6
యెహోవా సామాన్యులను కాపాడతారు; నేను దుర్దశలో ఉన్నప్పుడు, ఆయన నన్ను రక్షించారు.
7
నా ప్రాణమా, నీ విశ్రాంతికి తిరిగి వెళ్లు, ఎందుకంటే యెహోవా నీ పట్ల గొప్పగా వ్యవహరించారు.
8
యెహోవా, మీరు, మరణం నుండి నన్ను, కన్నీటి నుండి నా కళ్ళను, జారిపడకుండా నా పాదాలను విడిపించారు.
Settings