Skip to content
కీర్తనలు 109:6-19

కీర్తనలు 109:6-19

6
నా శత్రువు మీద ఒక దుష్టుని నియమించండి; అతని కుడి ప్రక్కన ఒక నేరం మోపేవాడు నిలబడాలి.
7
తీర్పు సమయంలో అతడు దోషిగా వెల్లడి కావాలి, అప్పుడు అతని ప్రార్థనలు పాపంగా లెక్కించబడతాయి.
8
అతడు బ్రతికే రోజులు కొద్దివిగా ఉండును గాక; అతని నాయకత్వం వేరొకడు తీసుకొనును గాక.
9
అతని పిల్లలు తండ్రిలేనివారు కావాలి, అతని భార్య విధవరాలు అవ్వాలి.
10
అతని పిల్లలు బిక్షకులై తిరుగుదురు గాక, వారు పాడుబడిన నివాసాల తోలివేయబడుదురు గాక.
11
అప్పిచ్చేవాడు అతని దగ్గర ఉన్నవన్నీ స్వాధీనం చేసుకోవాలి; అపరిచితులు అతని కష్టార్జితాన్ని దోచుకోవాలి.
12
అతని మీద ఎవరు దయ చూపకూడదు, తన తండ్రిలేని పిల్లలపై ఎవరికీ కనికరం చూపకూడదు.
13
అతని వంశం అంతరించాలి, వచ్చేతరం నుండి వారి పేర్లు తుడిచివేయబడాలి.
14
అతని పూర్వికుల దోషాలు యెహోవా మరువకూడదు, అతని తల్లి పాపాన్ని దేవుడు ఎన్నటికి తుడిచివేయకూడదు.
15
వారి పాపాలన్నీ ఎప్పుడూ యెహోవా ఎదుట ఉండాలి, తద్వార భూమి మీద నుండి అతని పిల్లల జ్ఞాపకాన్ని ఆయన తుడిచివేస్తారు.
16
దయ చూపించాలని అతడు ఎప్పుడూ అనుకోలేదు; కాని అతడు నలిగినవారిని పేదవారిని వేధించాడు ధైర్యము కోల్పోయిన వారిని హతమార్చాడు.
17
శపించటం అతనికి ఇష్టం కాబట్టి అది అతని మీదికే వచ్చింది. అతడు ఎవరినీ ఆశీర్వదించాలని కోరలేదు కాబట్టి అతడు ఆశీర్వాదాన్ని అనుభవించలేదు.
18
అతడు శాపాన్ని వస్త్రంగా ధరించాడు; అది నీరులా అతని కడుపులోకి, నూనెలా అతని ఎముకల్లోకి చొచ్చుకు పోయింది.
19
అది అతని చుట్టూ చుట్టబడిన వస్త్రంలా, అది నడుము దట్టిలా నిత్యం అతని చుట్టూ ఉండును గాక.

బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.