కీర్తనలు 106:19-23
19
హోరేబు పర్వతం దగ్గర వారు దూడ విగ్రహం చేయించుకున్నారు. పోత విగ్రహం ముందు విగ్రహారాధన చేశారు.
20
వారు మహిమగల దేవునికి బదులు తుక్కు మేసే ఎద్దు బొమ్మను ఉంచారు.
21
వారిని రక్షించిన దేవున్ని, ఈజిప్టులో ఆయన చేసిన గొప్ప కార్యాలను వారు మరచిపోయారు,
22
హాము దేశంలో అద్భుతకార్యాలు ఎర్ర సముద్రం ఒడ్డున ఆయన చేసిన భీకర క్రియలు.
23
“వీరిని నాశనం చేస్తాను” అన్నాడు దేవుడు. మోషే దేవుడు ఎన్నుకున్న వ్యక్తి. ఆయన వచ్చి దేవుని ఎదుట సందులో నిలిచి విజ్ఞాపన చేస్తే ఆయన ఉగ్రత వారిని ధ్వంసం చేయకుండా ఆపింది.
Settings