హిజ్కియా మనుష్యులు నకలు చేసిన సామెతలు: దేవుని మహిమ మరియు రాజు కర్తవ్యము
1
ఇవి కూడా సొలొమోను యొక్క సామెతలు, యూదా రాజైన హిజ్కియా సేవకులు వీటిని పోగుచేశారు.
2
ఒక విషయాన్ని దాచిపెట్టడం దేవుని గొప్పతనం; ఒక విషయాన్ని బయటకు లాగడం రాజుల గొప్పతనము.
3
ఆకాశాల ఎత్తు భూమి లోతు ఎలా కనుగొనలేమో, అలాగే రాజుల హృదయాలు కూడా శోధించలేనివి.
4
వెండిలోని లోహపు మడ్డిని తీసివేసి, కంసాలివాడు ఒక పాత్రను తయారుచేయగలడు;
5
రాజు ఎదుట నుండి చెడ్డ అధికారులను తొలగించండి, నీతి ద్వారా ఆయన సింహాసనం స్థాపించబడుతుంది.
బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.