సామెతలు 18:9-13
9
పనిలో అలసత్వం ప్రదర్శించేవాడు, వినాశకునికి సోదరుడు.
10
యెహోవా నామం బలమైన కోట, నీతిమంతుడు అందులోకి పరుగెత్తి క్షేమంగా ఉంటాడు.
11
ధనవంతుల ఆస్తి వారి యొక్క కోటగోడలు గల పట్టణం; వాని కళ్ళకు అది ఎక్కలేనంత ఎత్తైన గోడ.
12
నాశనానికి ముందు హృదయం గర్విస్తుంది, ఘనతకు ముందు వినయం ఉంటుంది.
13
సంగతి వినక ముందే జవాబిచ్చేవాడు తన బుద్ధిహీనతను బయటపెట్టి అవమానం పాలవుతాడు.
Settings