Skip to content
సామెతలు 18:13-18

సామెతలు 18:13-18

13
సంగతి వినక ముందే జవాబిచ్చేవాడు తన బుద్ధిహీనతను బయటపెట్టి అవమానం పాలవుతాడు.
14
నరుని ఆత్మ వాని రోగాన్ని సహిస్తుంది, కానీ నలిగిన హృదయాన్ని ఎవరు భరించగలరు?
15
వివేచన గలవారి హృదయం తెలివిని సంపాదిస్తుంది, జ్ఞానం గలవారి చెవులు దాన్ని తెరుచుకుంటాయి.
16
ఒక బహుమతి మార్గం తెరుస్తుంది అది ఇచ్చిన వ్యక్తిని గొప్పవారి ఎదుటకు రప్పిస్తుంది.
17
ప్రతివాది వచ్చి ప్రతివాదన చేసే వరకు, వాదోపవాదాలలో మొదట మాట్లాడేది న్యాయంగా అనిపిస్తుంది.
18
చీట్లు వేయడం వివాదాలను పరిష్కరిస్తుంది బలమైన ప్రత్యర్థులను వేరుగా ఉంచుతుంది.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options