Skip to content
సామెతలు 17:3

సామెతలు 17:3

చుట్టుపక్కల సందర్భంతో వచనం 3 చూపబడుతోంది.
1
తగాదాలతో కూడిన విందు కలిగి ఉన్న ఇంటి కంటే, సమాధానం నిశ్శబ్దంతో ఎండిన రొట్టె ముక్క తినుట మేలు.
2
వివేకంగల దాసుడు అవమానం తెచ్చే కుమారుని ఏలుతాడు కుటుంబంలో ఒకనిగా వారసత్వ సంపదను పంచుకుంటాడు.
3
వెండికి మూస బంగారానికి కొలిమి తగినది, అయితే హృదయాన్ని యెహోవా పరిశోధిస్తారు.
4
చెడు నడవడి కలవాడు మోసపు మాటలు వినును, అబద్ధికుడు నాశనకరమైన నాలుక మాటలు వింటాడు.
5
పేదవారిని ఎగతాళి చేసేవాడు వారిని చేసిన వానిని నిందించేవాడు, ఆపదను చూసి సంతోషించేవాడు శిక్ష నుండి తప్పించుకోడు.
6
పిల్లల పిల్లలు ముసలివారికి కిరీటం, తల్లిదండ్రులు వారి పిల్లలకు అలంకారము.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options