సామెతలు 13:4-9
4
సోమరి ఆకలి ఎన్నటికి తీరదు, కాని శ్రద్ధగా పని చేసేవారు తృప్తి చెందుతారు.
5
నీతిమంతులు అబద్ధమైన దానిని అసహ్యించుకుంటారు, దుర్మార్గులు తమను తాము దుర్గంధం చేసుకుంటారు తమ మీదికి అవమానం తెచ్చుకుంటారు.
6
నీతి నిజాయితీగల వ్యక్తిని కాపాడుతుంది, కాని దుష్టత్వం పాపిని పడగొడుతుంది.
7
కొందరు ఏమి లేకపోయినా ధనవంతులుగా నటిస్తారు; మరికొందరు బాగా ధనము కలిగి ఉండి కూడా, పేదవారిగా నటిస్తారు.
8
ఒకని ఐశ్వర్యం వారి ప్రాణాన్ని విమోచించవచ్చు, కాని పేదవాడు బెదిరింపు మాటలను వినడు.
9
నీతిమంతుల వెలుగు అంతకంతకు ప్రకాశించును, కాని దుర్మార్గుల దీపం ఆరిపోతుంది.
Settings