1
జ్ఞానం కలిగిన కుమారుడు తన తండ్రి క్రమశిక్షణ అంగీకరిస్తాడు, కాని ఎగతాళి చేసేవాడు గద్దింపుకు లోబడడు.
2
తమ పెదవుల ఫలం నుండి ప్రజలు మేలైన వాటిని ఆస్వాదిస్తారు, కాని నమ్మకద్రోహులు హింస పట్ల ఆకలిగొని ఉంటారు.
3
తమ పెదవులను కాచుకునేవారు తమ ప్రాణాలు కాపాడుకుంటారు, కాని దురుసుగా మాట్లాడేవారు పతనమవుతారు.