Skip to content
సామెతలు 10:22-32

సామెతలు 10:22-32

22
యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని తెస్తుంది, బాధ దుఃఖం దానికి జోడించబడవు.
23
బుద్ధిహీనులు దుష్ట పన్నాగాల్లో ఆనందిస్తారు, కాని వివేకంగలవారు జ్ఞానాన్నిబట్టి ఆనందిస్తారు.
24
దుష్టులు దేనికి భయపడతారో అదే వారి మీదికి వస్తుంది, నీతిమంతులు ఆశించిందే వారికి ఇవ్వబడుతుంది.
25
సుడిగాలి వచ్చినపుడు దుష్టులు లేకుండా పోతారు, కానీ నీతిమంతులు దృఢంగా నిలిచి ఉంటారు.
26
పళ్ళకు పులిసిన ద్రాక్షరసంలా కళ్లకు పొగలా, తమను పంపినవారికి సోమరివారు అలా ఉంటారు.
27
యెహోవాయందలి భయం దీర్ఘాయువును ఇస్తుంది, కాని దుష్టుల సంవత్సరాలు కుదించబడతాయి.
28
నీతిమంతుల ఆశలు ఆనందాన్నిస్తాయి కాని దుష్టుల ఆశలు ఫలించవు.
29
నింద లేనివారికి యెహోవా మార్గం ఒక ఆశ్రయం, కాని కీడు చేసేవారికి అది పతనము.
30
నీతిమంతులు ఎన్నడు కదిలించబడరు, కాని దుష్టులు దేశంలో ఉండరు.
31
నీతిమంతుల నోటి నుండి జ్ఞాన ఫలం వస్తుంది, అయితే వక్ర బుద్ధిగల నాలుక మూసివేయబడుతుంది.
32
నీతిమంతుల నోటికి దయ పొందడం తెలుసు, కాని దుష్టుల నోటికి వక్ర మాటలే తెలుసు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options