Skip to content
సంఖ్యాకాండము 9:11-21

సంఖ్యాకాండము 9:11-21

11
అయితే వారు రెండవ నెల పద్నాలుగవ రోజు సాయంకాలం జరుపుకోవాలి. వారు పులియని రొట్టెలతో, చేదు కూరలతో పాటు గొర్రెపిల్లను తినాలి.
12
తెల్లవారేటప్పడికి దానిలో ఏది మిగులకూడదు లేదా దాని ఎముకల్లో ఒక్కటి కూడా విరువకూడదు. పస్కాను జరుపుకున్నప్పుడు వారు నియమాలన్నీ పాటించాలి.
13
అయితే ఎవరైనా ఆచార ప్రకారం పవిత్రంగా ఉంటూ ప్రయాణంలో లేదా ఉన్న చోటే ఉంటూ, పస్కాను జరుపుకోకుండా ఉంటే, నిర్ణీత సమయంలో యెహోవాకు అర్పణను అర్పించనందుకు వారిని ప్రజల నుండి తొలగించాలి. వారి పాపానికి వారే పాపశిక్షను భరిస్తారు.
14
“ ‘మీ మధ్యలో ఉంటున్న విదేశీయులు కూడా యెహోవా పస్కాను నియమ నిబంధనలతో జరుపుకోవాలి. విదేశీయులకు స్వదేశీయులకు ఒకే నియమాలు ఉండాలి.’ ”
15
నిబంధన గుడారమైన సమావేశ గుడారం సిద్ధపరచబడిన రోజున దాన్ని మేఘం కమ్మింది. సాయంత్రం నుండి ఉదయం వరకు సమావేశ గుడారం మీద మేఘం అగ్నిలా కనిపించింది.
16
అది నిత్యం అలాగే ఉంది; మేఘం దాన్ని కమ్మింది, రాత్రివేళ ఆ మేఘం అగ్నిలా కనిపించేది.
17
గుడారం మీద నుండి మేఘం పైకి వెళ్లినప్పుడు, ఇశ్రాయేలీయులు బయలుదేరేవారు; ఎక్కడ మేఘం ఆగితే వారు అక్కడ గుడారాలు వేసుకునేవారు.
18
యెహోవా ఆజ్ఞ ప్రకారం ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసేవారు, ఆయన ఆజ్ఞ ప్రకారం అక్కడ ఉండేవారు. మేఘం సమావేశ గుడారం మీద నిలిచి ఉన్నంత వరకు వారు శిబిరంలో ఉండేవారు.
19
మేఘం ఎక్కువకాలం సమావేశ గుడారం మీద ఆగితే యెహోవా ఆజ్ఞ ప్రకారం ఇశ్రాయేలీయులు బయలుదేరేవారు కారు.
20
కొన్నిసార్లు మేఘం సమావేశ గుడారానికి కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది; యెహోవా ఆజ్ఞ ప్రకారం వారు శిబిరం చేస్తారు, ఆయన ఆజ్ఞ ప్రకారం వారు ప్రయాణం చేస్తారు.
21
కొన్నిసార్లు మేఘం సాయంత్రం నుండి ఉదయం వరకు మాత్రమే ఉండేది, ఉదయం ఎత్తినప్పుడు, వారు ప్రయాణించేవారు. పగలైన, రాత్రైనా, మేఘం ఎత్తినప్పుడల్లా వారు ప్రయాణించేవారు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options