కంటెంట్‌కు వెళ్లండి
సంఖ్యాకాండము 35:9-15

ఆశ్రయపట్టణాల స్థాపన

సంఖ్యాకాండము 35:9-15
9
తర్వాత యెహోవా మోషేతో ఇలా మాట్లాడారు:
10
“ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ ఇలా చెప్పు: ‘మీరు యొర్దాను దాటి కనానుకు వెళ్లినప్పుడు,
11
కొన్ని పట్టణాలను ఆశ్రయపురాలుగా ఎన్నుకోండి. ప్రమాదవశాత్తు ఒకరు ఎవరినైన చంపితే, వాటికి పారిపోయి ఆశ్రయం పొందవచ్చు.
12
ఆ పట్టణాలు ప్రతీకారం తీర్చుకునే వారి నుండి కాపాడుకోడానికి ఆశ్రయంగా ఉంటాయి, తద్వారా హత్యకు పాల్పడిన ఎవరైనా సమాజం ముందు విచారణకు రాకముందు చంపబడరు.
13
ఈ ఆరు పట్టణాలు మీ ఆశ్రయ పట్టణాలుగా ఉంటాయి.
14
మూడు యొర్దానుకు ఇటువైపు, మూడు కనాను దేశంలో ఆశ్రయపురాలుగా ఇవ్వాలి.
15
ఈ ఆరు పట్టణాలు ఇశ్రాయేలీయులు వారి మధ్య నివసించే విదేశీయులకు ఆశ్రయపురాలుగా ఉంటాయి, తద్వార, ప్రమాదవశాత్తు ఒకరు ఎవరినైన చంపితే, వాటికి పారిపోయి ఆశ్రయం పొందవచ్చు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options