Skip to content
సంఖ్యాకాండము 35:16-23

సంఖ్యాకాండము 35:16-23

16
“ ‘ఎవరైనా ఇనుప వస్తువుతో ఎవరినైన చచ్చేటట్టు కొడితే, ఆ వ్యక్తి హంతకుడు; హంతకుడు మరణశిక్ష పొందాలి.
17
లేదా ఒకవేళ ఎవరైనా ఒక రాయితో ఎవరినైన చచ్చేటట్టు కొడితే, ఆ వ్యక్తి హంతకుడు; హంతకుడు మరణశిక్ష పొందాలి.
18
లేదా ఒకవేళ ఎవరైనా ఒక చెక్క వస్తువుతో ఎవరినైన చచ్చేటట్టు కొడితే, ఆ వ్యక్తి హంతకుడు; హంతకుడు మరణశిక్ష పొందాలి.
19
పగ తీర్చుకునేవాడు ఆ హంతకునికి మరణశిక్ష వేయాలి; పగ తీర్చుకునేవాడు హంతకున్ని పట్టుకున్నప్పుడు అతన్ని చంపుతాడు.
20
ఎవరైనా పగతో నెట్టినా లేదా వారివైపు ఉద్దేశపూర్వకంగా చేతిలో ఉన్నదానిని వారి మీదికి విసిరివేసినా, వారు చనిపోతే
21
లేదా శత్రుత్వం బట్టి ఒకరిని పిడికిలితో కొడితే ఆ వ్యక్తి చస్తే, వాడు మరణశిక్ష పొందాలి; ఆ వ్యక్తి హంతకుడు. పగ తీర్చుకునేవాడు అతన్ని కలిసినప్పుడు అతన్ని చంపుతాడు.
22
“ ‘అయితే ఎవరైనా శత్రుత్వం లేకుండ ఎవరినైన అకస్మాత్తుగా నెట్టినా, లేదా వారివైపు అనుకోకుండ ఏదైనా విసిరినా,
23
లేదా చూడకుండ బరువైన రాయి వేసినా, వారు చనిపోతే, వేసినవానికి వారు శత్రువు కాదు హాని చేయాలనే ఉద్దేశం లేదు కాబట్టి,
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options