సంఖ్యాకాండము 14:1-10
1
ఆ రాత్రి సమాజంలో ఉన్న అందరు స్వరాలెత్తి బిగ్గరగా ఏడ్చారు.
2
ఇశ్రాయేలీయులందరు మోషే అహరోనుల మీద సణిగి, సమాజమంతా, “మేము ఈజిప్టులో గాని ఎడారిలో గాని చనిపోయుంటే బాగుండేది!
3
మేము ఖడ్గం చేత చావడానికి మమ్మల్ని యెహోవా ఈ దేశానికి ఎందుకు తెస్తున్నారు? మా భార్య పిల్లలు చెరగా కొనిపోబడతారు. ఈజిప్టుకు తిరిగి వెళ్లడం మాకు మంచిది కాదా?” అని వారితో అన్నారు.
4
వారు ఒకరితో ఒకరు, “మనం ఒక నాయకుని ఎన్నుకుని ఈజిప్టుకు తిరిగి వెళ్దాం” అని మాట్లాడుకున్నారు.
5
అప్పుడు మోషే అహరోనులు ఇశ్రాయేలు సమాజమందరి ఎదుట సాష్టాంగపడ్డారు.
6
ఆ దేశాన్ని వేగు చూడడానికి వెళ్లిన వారిలో ఉన్న నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు తమ బట్టలు చింపుకొని,
7
ఇశ్రాయేలు సమాజమంతటితో ఇలా అన్నారు: “మేము వెళ్లి పరిశీలించిన దేశం చాలా మంచిగా ఉంది.
8
యెహోవా మనయందు ఆనందిస్తే, ఆ దేశంలోనికి, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మనలను నడిపిస్తారు, దానిని మనకు ఇస్తారు.
9
మీరు మాత్రం యెహోవా మీద తిరగబడకండి. అక్కడి ప్రజలకు భయపడకండి ఎందుకంటే వారిని మనం చంపుతాము. వారికి కాపుదల లేదు, కానీ యెహోవా మనతో ఉన్నారు. వారికి భయపడకండి” అని చెప్పారు.
10
అయితే సమాజమంతా వారిని రాళ్లతో కొట్టాలని మాట్లాడుకున్నారు. అప్పుడు యెహోవా మహిమా ప్రకాశం సమావేశ గుడారం దగ్గర ఇశ్రాయేలీయులందరికి కనిపించింది.
Settings