Skip to content
సంఖ్యాకాండము 13:3

సంఖ్యాకాండము 13:3

చుట్టుపక్కల సందర్భంతో వచనం 3 చూపబడుతోంది.
1
యెహోవా మోషేతో ఇలా అన్నారు,
2
“కనాను దేశాన్ని పరిశీలించడానికి కొంతమంది పురుషులను పంపు, ఈ దేశం ఇశ్రాయేలీయులకు ఇవ్వబోతున్నాను. ప్రతి పితరుల గోత్ర నాయకుల్లో ఒకరిని పంపు.”
3
యెహోవా ఆజ్ఞ ప్రకారం మోషే వారిని పారాను ఎడారి నుండి పంపాడు. వారందరు ఇశ్రాయేలీయుల నాయకులు.
4
వారి పేర్లు ఇవి: రూబేను గోత్రం నుండి, జక్కూరు కుమారుడైన షమ్మూయ;
5
షిమ్యోను గోత్రం నుండి, హోరీ కుమారుడైన షాపాతు;
6
యూదా గోత్రం నుండి యెఫున్నె కుమారుడైన కాలేబు;
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options