నెహెమ్యా 4:2-3
2
తన స్నేహితుల ఎదుట సమరయ సైనికుల ఎదుట మాట్లాడుతూ, “ఈ బలహీనమైన యూదులు ఏం చేయగలరు? తమంతట తామే ఈ పని చేయగలరా? వారే బలి అర్పిస్తారా? ఒక రోజులోనే పనంతా చేసేస్తారా? కాలిపోయి చెత్తకుప్పగా పడి ఉన్న రాళ్లతో మళ్ళీ కడతారా?” అన్నాడు.
3
అతని ప్రక్కన నిలబడి ఉన్న అమ్మోనీయుడైన టోబీయా, “వారు కట్టిన గోడ మీదికి నక్క ఎక్కితే అది కూలిపోతుంది” అన్నాడు.
Settings