నెహెమ్యా 4:15-18
15
తమ కుట్ర గురించి మాకు తెలిసిందని దేవుడు వారి కుట్ర భంగం చేశారని మా శత్రువులు వినగానే, మాలో ప్రతి ఒక్కరు తమ పని చేయడానికి గోడ దగ్గరకు వచ్చారు.
16
ఆ రోజు నుండి నా పనివారిలో సగం మంది పని చేస్తుండగా మిగతా సగం మంది ఈటెలు డాళ్లు విండ్లు కవచాలు ధరించి వచ్చారు. గోడ కట్టే యూదా కుటుంబాలన్నిటి వెనుక అధికారులు నిలబడి ఉన్నారు.
17
బరువులు మోసేవారు ఒక చేతితో తమ పని చేస్తూ మరో చేతితో ఆయుధం పట్టుకున్నారు.
18
కట్టే ప్రతి ఒక్కరు కడుతున్నప్పుడు తన కత్తి నడుముకు బిగించుకుని ఉన్నారు. బూర ఊదేవాడు నా దగ్గరే నిలబడ్డాడు.
Settings