నెహెమ్యా 3:6-12
6
యెషానా గుమ్మాన్ని పాసెయ కుమారుడైన యెహోయాదా బెసోద్యా కుమారుడైన మెషుల్లాము బాగుచేశారు. వారు దానికి దూలాలు పెట్టి, తలుపులు నిలబెట్టి, తాళాలు గడియలు బిగించారు.
7
ఆ ప్రక్క నుండి గిబియోను, మిస్పా పట్టణస్థులైన గిబియోనీయుడైన మెలట్యా, మేరోనోతీయుడైన యాదోను బాగుచేశారు. యూఫ్రటీసు నది అవతలి అధిపతుల ఆధీనంలో ఉన్న స్థలాల వరకు వారు బాగుచేశారు.
8
ఆ ప్రక్క భాగాన్ని కంసాలివాడైన హర్హయా కుమారుడైన ఉజ్జీయేలు బాగుచేశాడు. అతని ప్రక్కనే పరిమళద్రవ్యాలు తయారుచేసేవారిలో ఒకడైన హనన్యా బాగుచేశాడు. వారు విశాల గోడ వరకు యెరూషలేమును తిరిగి కట్టారు.
9
వీరి ప్రక్క భాగాన్ని యెరూషలేములో సగభాగానికి అధిపతియైన హూరు కుమారుడైన రెఫాయా బాగుచేశాడు.
10
వారిని ఆనుకుని తన ఇంటికి ఎదురుగా ఉన్న భాగాన్ని హరూమపు కుమారుడైన యెదాయా బాగుచేశాడు. అతని ప్రక్కనే హషబ్నెయా కుమారుడైన హట్టూషు బాగుచేశాడు.
11
రెండవ భాగాన్ని, బట్టీల గోపురాన్ని హారీము కుమారుడైన మల్కీయా, పహత్-మోయాబు కుమారుడైన హష్షూబు బాగుచేశారు.
12
వారి ప్రక్క భాగంలో యెరూషలేములో సగభాగానికి అధిపతియైన హల్లోహేషు కుమారుడైన షల్లూము అతని కుమార్తెల సహాయంతో బాగుచేశారు.
Settings