నెహెమ్యా 3:1-5
1
ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు అతని సోదరులైన యాజకులును వెళ్లి గొర్రెల గుమ్మాన్ని కట్టి ప్రతిష్ఠించి దాని తలుపులు నిలబెట్టారు. వందవ గోపురం వరకు, హనానేలు గోపురం వరకు వారు నిర్మించి ప్రతిష్ఠించారు.
2
ఆ ప్రక్కనే యెరికో పట్టణస్థులు కట్టారు. వారి ప్రక్కన ఇమ్రీ కుమారుడైన జక్కూరు కట్టాడు.
3
చేప గుమ్మాన్ని హస్సెనాయా కుమారులు తిరిగి కట్టారు. వారు దానికి దూలాలు పెట్టి, తలుపులు నిలబెట్టి, తాళాలు గడియలు అమర్చారు.
4
వారి ప్రక్క భాగంలో హక్కోజుకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోతు మరమ్మత్తు చేశాడు. అతని తర్వాత మెషేజబేలుకు పుట్టిన బెరెక్యా కుమారుడైన మెషుల్లాము, ఆ ప్రక్కన బయనా కుమారుడైన సాదోకు వరుసగా బాగుచేశారు.
5
ఆ ప్రక్క భాగాన్ని తెకోవాకు చెందినవారు బాగుచేశారు. అయితే తమ అధిపతుల క్రింద పనిని చేయడానికి వారి అధికారులు ఒప్పుకోలేదు.
Settings