Skip to content
మీకా 2:1-9

మీకా 2:1-9

1
తమ పడకల మీద పాపపు ఆలోచనలు చేసేవారికి, కీడును తలంచే వారికి శ్రమ! వారికి అధికారం ఉంది కాబట్టి, ఉదయకాల వెలుగులో వారు చెడు చేస్తారు.
2
వారు భూములను ఆశించి ఆక్రమించుకుంటారు, ఇళ్ళను ఆశించి తీసుకుంటారు. వారు ప్రజలను మోసం చేసి వారి ఇళ్ళను లాక్కుంటారు, ప్రజల నుండి వారి స్వాస్థ్యాన్ని దోచుకుంటారు.
3
కాబట్టి యెహోవా చెప్పే మాట ఇదే: “నేను ఈ వంశం మీదికి విపత్తు రప్పించబోతున్నాను, దాని నుండి మీరు మిమ్మల్ని కాపాడుకోలేరు. అది విపత్తు కాలం కాబట్టి మీరు ఇక ఎన్నడు గర్వంగా నడవలేరు.
4
ఆ రోజు ప్రజలు మీ గురించి ఒక సామెత చెప్తారు; మీ గురించి ఈ విషాద గీతం పాడుతూ ఎగతాళి చేస్తారు: ‘మేము పూర్తిగా పాడైపోయాం; నా ప్రజల ఆస్తి విభజింపబడింది ఆయన దాన్ని నా నుండి తీసుకుంటారు! ఆయన మా భూములను దేశద్రోహులకు అప్పగించారు.’ ”
5
అందువల్ల చీట్లువేసి భూమిని కొలమానం ప్రకారం పంచడానికి యెహోవా సమాజంలో ఎవరూ ఉండరు.
6
“ప్రవచించకండి” అని వారి ప్రవక్తలు అంటారు, “వీటి గురించి ప్రవచించకండి; మనకు అవమానం కలుగకూడదు.”
7
యాకోబు వారసులారా, “యెహోవా సహనం కోల్పోయారా? ఆయన ఇలాంటి పనులు చేస్తారా?” అని అనవచ్చా? “యథార్థంగా ప్రవర్తించే వారికి నా మాటలు క్షేమం కలిగించవా?
8
ఇటీవల నా ప్రజలే శత్రువుగా లేచారు. యుద్ధం నుండి తిరిగి వచ్చే మనుష్యుల్లా, నిర్భయంగా దారిన పోతూ ఉన్న వారి నుండి సంపన్న వస్త్రాన్ని మీరు లాగివేస్తారు.
9
నా ప్రజల స్త్రీలను వారికిష్టమైన గృహాలలో నుండి వెళ్లగొడతారు. వారి పిల్లల మీద ఎప్పటికీ నా ఆశీర్వాదం ఉండకుండా చేస్తున్నారు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options