లూకా 17:26-32
26
“నోవహు దినాల్లో జరిగినట్టు, మనుష్యకుమారుని దినాల్లో కూడా జరుగుతుంది.
27
నోవహు ఓడలోనికి ప్రవేశించిన రోజు వరకు ప్రజలందరూ తింటూ, త్రాగుతూ, పెండ్లి చేసుకొంటూ, పెండ్లికిస్తూ ఉన్నారు. అప్పుడు జలప్రళయం వచ్చి వారందరిని నాశనం చేసింది.
28
“లోతు దినాల్లో జరిగినట్టే జరుగుతుంది. ప్రజలు తింటూ త్రాగుతూ కొంటూ అమ్ముతూ మొక్కలు నాటుతూ, ఇళ్ళు కడుతున్నారు.
29
కానీ లోతు సొదొమ గ్రామం విడిచి వెళ్లిన రోజునే ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిసి వారందరు నాశనం అయ్యారు.
30
“మనుష్యకుమారుడు ప్రత్యక్షమయ్యే రోజు కూడా అలాగే ఉంటుంది.
31
ఆ రోజు ఇంటిపైన ఉన్నవారెవరు ఇంట్లోనుండి తమ వస్తువులను తెచ్చుకోవడానికి క్రిందికి దిగి వెళ్లకూడదు. అలాగే పొలంలో ఉన్నవారు ఏమైనా తెచ్చుకోడానికి తిరిగి వెనుకకు వెళ్లకూడదు.
32
లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి.
Settings