Skip to content
లూకా 1:21-25

లూకా 1:21-25

21
అంతలో, ప్రజలు జెకర్యా కోసం ఎదురుచూస్తూ దేవాలయంలో అతడు ఆలస్యం ఎందుకు చేస్తున్నాడో అని ఆశ్చర్యపడుతూ ఉన్నారు.
22
అతడు బయటకు వచ్చాక, అతడు వారితో మాట్లాడలేకపోయాడు. అతడు తమతో మాట్లాడటానికి బదులు సైగలు చేస్తూ ఉండడంతో, అతడు దేవాలయంలో దర్శనం చూశాడని వారు గ్రహించారు.
23
అతని సేవ కాలం పూర్తయినప్పుడు, అతడు ఇంటికి వెళ్లిపోయాడు.
24
ఆ తర్వాత అతని భార్య ఎలీసబెతు గర్భం ధరించి అయిదు నెలల వరకు ఇతరులకు కనబడకుండా ఉండింది.
25
ఆమె, “ప్రభువే నా కోసం ఈ కార్యం చేశారు, ఈ దినాల్లో ఆయన నన్ను కరుణించి, నా ప్రజలమధ్య నాకున్న అవమానం తొలగించారు” అని అన్నది.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 90 chars

Options