Skip to content
లేవీయకాండము 7:28-36

లేవీయకాండము 7:28-36

28
యెహోవా మోషేతో ఇలా అన్నారు,
29
“నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘ఎవరైనా యెహోవాకు సమాధానబలిని తెస్తే, దానిలో ఒక భాగాన్ని ప్రత్యేకంగా యెహోవాకు అర్పించాలి.
30
వారు తమ స్వహస్తాలతో హోమబలిని యెహోవాకు అర్పించాలి; వారు రొమ్ము భాగాన్ని దాని మీద ఉన్న క్రొవ్వుతో పాటు తెచ్చి, ఆ రొమ్ము భాగాన్ని యెహోవా ఎదుట పైకెత్తి ప్రత్యేక అర్పణగా అర్పించాలి.
31
యాజకుడు ఆ క్రొవ్వును బలిపీఠం మీద దహించాలి, కాని రొమ్ము భాగం అహరోను, అతని కుమారులకు చెందుతుంది.
32
సమాధానబలులలో నుండి తీసిన కుడి తొడను యాజకునికి కానుకగా ఇవ్వాలి.
33
అహరోను కుమారులలో ఎవరైతే సమాధానబలి రక్తాన్ని, క్రొవ్వును అర్పిస్తాడో అతడు ఆ కుడి తొడను తన వాటాగా తీసుకోవచ్చు.
34
ఇశ్రాయేలీయుల సమాధానబలులలో నుండి నేను పైకెత్తిన రొమ్ము భాగాన్ని, అర్పించిన తొడను తీసుకుని యాజకుడైన అహరోనుకు అతని కుమారులకు ఇశ్రాయేలీయుల నుండి శాశ్వత వాటాగా ఇచ్చాను.’ ”
35
ఇది యెహోవాకు అర్పించిన హోమబలులలో అహరోను, అతని కుమారులు యెహోవాకు యాజకులుగా సేవ చేయడానికి సమర్పించబడిన రోజున వారికి కేటాయించబడిన వాటా.
36
వారు అభిషేకించబడిన రోజున, ఇశ్రాయేలీయులు రాబోయే తరాలకు తమ శాశ్వత వాటాగా ఇవ్వాలని యెహోవా ఆజ్ఞాపించారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options