Skip to content
లేవీయకాండము 5:15-19

లేవీయకాండము 5:15-19

15
“యెహోవాకు చెందిన పరిశుద్ధమైన వాటిలో దేని విషయంలోనైనా, ఎవరైనా అనుకోకుండ పాపం చేసి ఎవరైనా యెహోవా పట్ల నమ్మకద్రోహులైతే, వారు మంద నుండి లోపం లేని, పరిశుద్ధాలయం యొక్క షెకెల్ ప్రకారం, వెండిలో సరియైన విలువగల ఒక పొట్టేలును ప్రాయశ్చిత్తంగా తీసుకురావాలి. ఇది అపరాధపరిహారబలి.
16
ఆ వ్యక్తి పవిత్ర పదార్థం విషయంలో తప్పిదం చేసినందుకు, అధనంగా దాని విలువలో అయిదవ వంతు నష్టపరిహారం చెల్లించి అదంతా యాజకునికి ఇవ్వాలి. యాజకుడు పొట్టేలును అపరాధపరిహారబలిగా వారికి ప్రాయశ్చిత్తం చేస్తాడు, వారు క్షమించబడతారు.
17
“ఎవరైనా పాపం చేసి, యెహోవా ఆజ్ఞలలో నిషేధించబడిన దేనినైన చేసినప్పుడు, అది వారికి తెలియకపోయినా సరే, వారు అపరాధులు, కాబట్టి వారు శిక్ష భరిస్తారు.
18
వారు మంద నుండి అపరాధపరిహారబలిగా, ఒక లోపం లేని, సరియైన విలువగల పొట్టేలును యాజకుని దగ్గరకు తీసుకురావాలి. ఈ విధంగా యాజకుడు వారు అనుకోకుండ చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేస్తాడు, వారు క్షమించబడతారు.
19
ఇది అపరాధ పరిహారార్థబలి; అతడు యెహోవాకు విరోధంగా తప్పు చేసినందుకు అపరాధి అయ్యాడు.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options