Skip to content
లేవీయకాండము 5:7-13

లేవీయకాండము 5:7-13

7
“ ‘గొర్రెపిల్లను కొనలేని వారెవరైనా వారి పాపానికి జరిమానాగా రెండు పావురాలు లేదా రెండు చిన్న గువ్వలను యెహోవా దగ్గరకు తీసుకురావాలి, వాటిలో ఒకటి పాపపరిహారబలి కోసం మరొకటి దహనబలి కోసము.
8
అతడు వాటిని యాజకుడి దగ్గరకు తీసుకురావాలి, యాజకుడు మొదట పాపపరిహారబలి అర్పిస్తాడు. అతడు దాని తలను దాని మెడ నుండి పూర్తిగా వేరు చేయకుండ, మెలిపెట్టాలి, తల విరిచేయకూడదు,
9
పాపపరిహారబలి యొక్క రక్తంలో కొంత భాగాన్ని బలిపీఠం వైపు చల్లాలి; మిగిలిన రక్తం బలిపీఠం యొక్క అడుగు నుండి బయటకు పంపాలి. ఇది పాపపరిహారబలి.
10
యాజకుడు మరొకదాన్ని నిర్ణీత విధానంలో దహనబలిగా అర్పించి, వారు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేయాలి, వారు క్షమించబడతారు.
11
“ ‘అయితే, ఒకవేళ వారు రెండు పావురాలు లేదా రెండు గువ్వలను కొనలేకపోతే, వారు తమ పాపానికి బలిగా పాపపరిహారబలి కోసం ఒక ఓమెరు నాణ్యమైన పిండి తీసుకురావాలి. వారు దానిపై ఒలీవనూనె గాని ధూపం గాని పెట్టకూడదు, ఎందుకంటే అది పాపపరిహారబలి.
12
వారు దానిని యాజకుని దగ్గరకు తీసుకురావాలి, అతడు దానిలో ఒక చేతినిండ భాగాన్ని జ్ఞాపక భాగంగా తీసుకుని యెహోవాకు సమర్పించిన హోమబలుల పైన బలిపీఠం మీద కాల్చాలి. ఇది పాపపరిహారబలి.
13
ఈ విధంగా యాజకుడు వారు చేసిన ఈ పాపాల్లో దేనికోసమైనా ప్రాయశ్చిత్తం చేస్తాడు, వారు క్షమించబడతారు. మిగిలిన అర్పణ, భోజనార్పణ మాదిరిగానే యాజకునికి చెందుతుంది.’ ”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options