Skip to content
న్యాయాధిపతులు 6:7-12

న్యాయాధిపతులు 6:7-12

7
మిద్యానును బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాను వేడుకున్నప్పుడు,
8
ఆయన వారి కోసం ఒక ప్రవక్తను పంపారు. అతడు ఇలా అన్నాడు, “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నారు: నేను బానిస దేశమైన ఈజిప్టు నుండి మిమ్మల్ని బయటకు తీసుకువచ్చాను.
9
ఈజిప్టువారి చేతి నుండి మిమ్మల్ని రక్షించాను. మిమ్మల్ని బాధపెట్టిన వారందరి చేతిలో నుండి విడిపించాను; మీ ఎదుట నుండి వారిని తరిమేసి వారి దేశాన్ని మీకిచ్చాను.
10
నేను మీతో, ‘మీ దేవుడనైన యెహోవాను నేనే; మీరు నివసించే అమోరీయుల దేశంలో వారి దేవుళ్ళకు భయపడకూడదు’ అని చెప్పాను కాని మీరు నా మాట వినలేదు.”
11
యెహోవా దూత వచ్చి ఒఫ్రాలో అబీయెజ్రీయుడైన యోవాషుకు చెందిన మస్తకిచెట్టు క్రింద కూర్చున్నాడు. అక్కడ యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు కనపడకుండా ద్రాక్షగానుగ చాటున గోధుమలను దుళ్లగొడుతున్నాడు.
12
యెహోవా దూత గిద్యోనుకు ప్రత్యక్షమై, “పరాక్రమంగల యోధుడా, యెహోవా నీకు తోడుగా ఉన్నారు” అన్నాడు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options