కంటెంట్‌కు వెళ్లండి
న్యాయాధిపతులు 3:8-11

ఒత్నీయేలు ద్వారా ఇశ్రాయేలు విమోచించబడుట

న్యాయాధిపతులు 3:8-11
8
యెహోవా కోపం ఇశ్రాయేలుపై మీద రగులుకున్నందుకు ఆయన వారిని అరాము నహరయీము రాజైన కూషన్-రిషాతాయిముకు వారిని అమ్మేశారు, అతనికి వారు ఎనిమిది సంవత్సరాలు దాసులుగా ఉన్నారు.
9
అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టినప్పుడు, ఆయన వారి కోసం రక్షకునిగా కాలేబు తమ్ముడైన కెనజు కుమారుడైన ఒత్నీయేలును నియమించారు, అతడు వారిని రక్షించాడు.
10
యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చినందుకు అతడు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉంటూ యుద్ధానికి వెళ్లాడు. యెహోవా ఒత్నీయేలు చేతికి అరాము రాజైన కూషన్-రిషాతాయిమును అప్పగించారు, అతడు అతన్ని ఓడించాడు.
11
కాబట్టి కెనజు కుమారుడైన ఒత్నీయేలు చనిపోయే వరకు నలభై సంవత్సరాలు దేశం సమాధానంతో ఉంది.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options