న్యాయాధిపతులు 15:10-12
10
యూదా ప్రజలు వారిని, “మీరెందుకు మా మీదికి వచ్చారు?” అని అడిగారు. అందుకు వారు, “మేము సంసోను మాకెలా చేశాడో మేము కూడ అతనికి అలాగే చేయడానికి వచ్చాం, మేము అతన్ని బంధించి తీసుకెళ్లడానికి వచ్చాం” అని జవాబిచ్చారు.
11
అప్పుడు యూదా నుండి మూడువేలమంది పురుషులు ఏతాము బండలో ఉన్న గుహలోకి దిగి, సంసోనుతో, “ఫిలిష్తీయులు మనలను పరిపాలిస్తున్నారని నీకు తెలియదా? మా మీదికి ఇంత ప్రమాదాన్ని ఎందుకు తెచ్చిపెట్టావు?” అని అన్నాడు. అతడు వారితో, “వారు నాకు ఏమి చేశారో నేను వారికి అదే చేశాను!” అన్నాడు.
12
అందుకు వారు అతనితో, “సరే, నిన్ను బంధించి ఫిలిష్తీయులకు అప్పగించడానికి మేము వచ్చాం” అన్నాడు. అందుకు సంసోను, “మీరు మాత్రం నన్ను చంపరని నాకు ప్రమాణం చేయండి” అని వారితో అన్నాడు.
Settings