న్యాయాధిపతులు 15:14-17
14
అతడు లేహిని సమీపించినప్పుడు, ఫిలిష్తీయులు కేకలువేస్తూ అతని దగ్గరకు వచ్చారు. యెహోవా ఆత్మ బలంగా అతని మీదికి రాగా అతని చేతులకున్న త్రాళ్లు కాలిపోయిన నారపీచులై అతని చేతుల నుండి తెగిపడిపోయాయి.
15
అక్కడే అతనికి గాడిద పచ్చి దవడ ఎముక ఒకటి దొరికింది. అతడు దాన్ని చేతపట్టుకుని దానితో వేయిమందిని చంపేశాడు.
16
అప్పుడు సంసోను, “గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను, రెండు కుప్పలను చంపాను. గాడిద దవడ ఎముకతో వేయిమందిని చంపాను” అని,
17
అతడు మాట్లాడడం ముగించిన తర్వాత, ఆ దవడ ఎముకను పారవేశాడు; ఆ స్థలం రామత్ లేహి అని పిలువబడింది.
Settings